ప్రపంచ అందగాళ్ల జాబితాలో ప్రిన్స్ మహేశ్ బాబు..

దిశ, సినిమా: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించింది. 2021వ సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అందమైన పురుషుల జాబితాలో చోటు దక్కింది. మహేశ్ ఈ లిస్టులో 10వ స్థానంలో నిలవగా.. సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన ఏకైక నటుడు అతనే కావడం విశేషం. టాప్ 5 విషయానికొస్తే.. నార్త్ ఇండియా నుంచి స్టార్ హీరో హృతిక్ రోషన్‌‌కు 3వ స్థానం లభించింది. ఇక ‘బ్యాట్‌మ్యాన్‌’ మూవీతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు […]

Update: 2021-12-25 01:23 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించింది. 2021వ సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అందమైన పురుషుల జాబితాలో చోటు దక్కింది. మహేశ్ ఈ లిస్టులో 10వ స్థానంలో నిలవగా.. సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన ఏకైక నటుడు అతనే కావడం విశేషం. టాప్ 5 విషయానికొస్తే.. నార్త్ ఇండియా నుంచి స్టార్ హీరో హృతిక్ రోషన్‌‌కు 3వ స్థానం లభించింది. ఇక ‘బ్యాట్‌మ్యాన్‌’ మూవీతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా మహేశ్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్1న విడుదల కానుంది.

Read more : నాగచైతన్య- సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడియోలో కలుసుకున్న మాజీ కపుల్స్

 

 

Tags:    

Similar News