నా చివరి మ్యాచ్ అప్పుడే.. ఐపీఎల్‌పై ధోని ఫుల్ క్లారిటీ
దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడిన తర్వాతే తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. శనివారం చెన్నైలో సీఎస్కే ఐపీఎల్ 2021 టైటిల్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఇందులో పాల్గొన్న ధోని తన మనసులో మాట చెప్పాడు. ‘నేను నా క్రికెట్ కెరీర్‌ను ఎప్పుడూ ప్లానింగ్ తోనే కొనసాగించాను. నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ స్వదేశంలోని రాంచీలో ఆడాను. […]
దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడిన తర్వాతే తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. శనివారం చెన్నైలో సీఎస్కే ఐపీఎల్ 2021 టైటిల్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఇందులో పాల్గొన్న ధోని తన మనసులో మాట చెప్పాడు. ‘నేను నా క్రికెట్ కెరీర్‌ను ఎప్పుడూ ప్లానింగ్ తోనే కొనసాగించాను. నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ స్వదేశంలోని రాంచీలో ఆడాను. అలాగే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే ఏడాదా లేదా 5 ఏళ్ల తర్వాత అనేది తెలియదు. కానీ చివరి మ్యాచ్ మాత్రం చెన్నైలోనే ఆడతాను. ఈ ప్లాట్ ఫామ్ చాలా గొప్పది. మాజీ క్రికెటర్లు, నా సహచర క్రికెట్లు, బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ క్రికెట్ కోసం ఎంతో చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉన్నది. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కృషి చేస్తున్నారు’ అని ధోని అన్నాడు.