బడ్జెట్ ప్రతిపై ‘గాంధీ హత్యోదంతం’
కేరళ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రతిపై మహాత్మాగాంధీ హత్యోదంతాన్ని చిత్రీకరించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో తన ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్ ఐసాక్ సభలో మాట్లాడుతూ,గాంధీ హత్యను మరోసారి గుర్తు చేయాలని తాము అనుకుంటున్నామనీ, మహాత్మాగాంధీని ఎవరు హత్యచేశారో ఎప్పటికీ మరచిపోమని చెప్పారు. ఓ మతోన్మాది చేతిలో ఆయన హత్యకు గురయ్యారనీ, […]
కేరళ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రతిపై మహాత్మాగాంధీ హత్యోదంతాన్ని చిత్రీకరించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో తన ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్ ఐసాక్ సభలో మాట్లాడుతూ,గాంధీ హత్యను మరోసారి గుర్తు చేయాలని తాము అనుకుంటున్నామనీ, మహాత్మాగాంధీని ఎవరు హత్యచేశారో ఎప్పటికీ మరచిపోమని చెప్పారు.
ఓ మతోన్మాది చేతిలో ఆయన హత్యకు గురయ్యారనీ, దీన్ని ప్రజలెవరూ మరిచిపోకూడదన్న ఉద్దేశంతో ముద్రించామని తెలిపారు. సీఏఏపై పార్టీలకతీతంగా పోరాడాలని మంత్రి పిలుపునిచ్చారు. మలయాళం ఆర్టిస్టు వేసిన ఈ చిత్రంలో బుల్లెట్ గాయాల కారణంగా బాపు రక్తపు మడుగులో పడిఉన్నారు.
మద్దతుదారులు ఆయన చుట్టూ చేరి రోదిస్తున్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ చర్యను ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల (కాంగ్రెస్) తప్పుబట్టారు. తాము కూడా ఆర్ఎస్సెస్-బీజేపీ విధానాలపై పోరాడుతున్నామనీ, అంతమాత్రాన బడ్జెట్ ప్రతిపై ముద్రించడం సరికాదన్నారు. డిప్యూటీ ప్రతిపక్ష నేత ఎంకే మునీర్ మాట్లాడుతూ, మహాత్ముడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదనీ, ఆయన అందరి మనుషుల్లో ఉన్నారని చెప్పారు. ఒకవేళ ఇదే ప్రభుత్వ విధానమై ఉంటే దీన్ని గవర్నర్ ప్రసంగ పతిపై ముద్రించాలే తప్ప బడ్జెట్ ప్రసంగ ప్రతిపై కాదని మునీర్ తెలిపారు.