ఖాళీ కడుపున… కాలినడకన..
దిశ, మెదక్: లాక్‌డౌన్‌తో ఆకలి బాధను తట్టుకోలేక వలస కూలీలు కాలినడకన సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. చేయడానికి పని, తినడానికి తిండి లేకపోవడంతో కష్టమైనా లెక్కచేయకుండా కాలినడకన వెళ్తున్నారు. మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన కూలీలు లాక్‌డౌన్ తో హైదరాబాద్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లాపాపలతో కలిసి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తలపై మూటలతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ కూలీలు సంగారెడ్డి వరకు చేరుకున్నారు. స్థానికులు […]
దిశ, మెదక్: లాక్‌డౌన్‌తో ఆకలి బాధను తట్టుకోలేక వలస కూలీలు కాలినడకన సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. చేయడానికి పని, తినడానికి తిండి లేకపోవడంతో కష్టమైనా లెక్కచేయకుండా కాలినడకన వెళ్తున్నారు. మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన కూలీలు లాక్‌డౌన్ తో హైదరాబాద్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లాపాపలతో కలిసి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తలపై మూటలతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ కూలీలు సంగారెడ్డి వరకు చేరుకున్నారు. స్థానికులు వీరిని గమనించి ఆరా తీయడంతో కుటుంబ పోషణ, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామని, అందుకే స్వగ్రామాలకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు.
Tags: Migrants, Medak, Maharashtra, workers, get back