ముంబైలో ఐపీఎల్‌కు లైన్ క్లియర్

దిశ, వెబ్‌డెస్క్ :ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రాత్రి 8 గంటల తర్వాత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు ఆ తర్వాత గ్రౌండ్ నుంచి హోటళ్లకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చింది. బయో బబుల్‌ వాతావరణంలోనే ఆటగాళ్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. నేటి నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. కర్ఫ్యూ సమయంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు, ఆ తర్వాత తిరిగి హోటల్స్‌కి […]

Update: 2021-04-05 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ :ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రాత్రి 8 గంటల తర్వాత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు ఆ తర్వాత గ్రౌండ్ నుంచి హోటళ్లకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చింది. బయో బబుల్‌ వాతావరణంలోనే ఆటగాళ్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది.

నేటి నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. కర్ఫ్యూ సమయంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు, ఆ తర్వాత తిరిగి హోటల్స్‌కి చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయా?.. లేదా? అనే సందిగ్ధతకు తెర పడినట్లు అయింది. కాగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News