10, 12వ తరగతి పరీక్షలు వాయిదా..
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ రికార్డు స్థాయిలో పాజిటవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీల పరీక్షలపై మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. […]
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ రికార్డు స్థాయిలో పాజిటవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీల పరీక్షలపై మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.