డ్రోన్ కెమెరాతో ప్రజా కదలికలపై నిఘా

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ అణువణువునా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని బి.కె. రెడ్డి కాలనీలో డ్రోన్ కెమెరా సాయంతో ఆకాశ వీక్షణ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న కదలికలను పోలీసులు గమనించారు. రాత్రింబగళ్లూ ఈ నిఘా ఉంటుందనీ, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు. క్లస్టర్ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా […]

Update: 2020-04-11 02:17 GMT

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ అణువణువునా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని బి.కె. రెడ్డి కాలనీలో డ్రోన్ కెమెరా సాయంతో ఆకాశ వీక్షణ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న కదలికలను పోలీసులు గమనించారు. రాత్రింబగళ్లూ ఈ నిఘా ఉంటుందనీ, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు. క్లస్టర్ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags: mahaboobnagar, police, drone camera, lockdown, corona, sp rema rajeshwari

Tags:    

Similar News