ఆలోచనలో మహబూబ్‌నగర్ ప్రజలు

దిశ‌ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా తీవ్రతకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ప్రతి ఏడాదీ జూన్ 12న తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఈ ఏడాది నేటికీ తెరుచుకోలేదు. పోయిన విద్యా సంవత్సరం ముగిసే దశలో కరోనా విజృంభించడం ప్రారంభం కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పరీక్షలు నిర్వహించకుండా పలు తరగతుల విద్యార్థులను పాస్ చేశారు. మామూలుగా అయితే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి ఇప్పటికే రెండు నెలల కావాలి. కానీ, నేటికీ పాఠశాలలు ఓపెన్ కాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా […]

Update: 2020-08-08 20:44 GMT

దిశ‌ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా తీవ్రతకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ప్రతి ఏడాదీ జూన్ 12న తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఈ ఏడాది నేటికీ తెరుచుకోలేదు. పోయిన విద్యా సంవత్సరం ముగిసే దశలో కరోనా విజృంభించడం ప్రారంభం కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పరీక్షలు నిర్వహించకుండా పలు తరగతుల విద్యార్థులను పాస్ చేశారు. మామూలుగా అయితే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి ఇప్పటికే రెండు నెలల కావాలి. కానీ, నేటికీ పాఠశాలలు ఓపెన్ కాలేదు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,220 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 5.95లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోయినప్పటికీ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలను అందించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా విద్యను బోధిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా చాలా వరకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

మరికొన్ని పాఠశాలలు ఏకంగా ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాయి. పాఠశాలలు తెరిచిన తరువాతే రండి అంటూ నిర్మొహమాటంగా చెబుతున్నాయి. పాఠశాలలు పూర్తి స్థాయిలో మూతపడడంతో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం ఆన్‌లైన్ పద్ధతిలో విద్యను బోధిస్తూ విద్యా సంవత్సరాని ప్రారంభించామంటూ చెపుకోని ఫీజులను వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడంతో చాలా మంది పిల్లలు తాము నేర్చుకున్న పాఠాలు మర్చిపోతున్నారని తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు నాలుగు నెలలుగా పిల్లలకు ఇండ్లకే పరిమితం కావడంతో వారు పూర్తిగా చదువకు దూరం అవుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్నందున పాఠశాలలో ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న క్రమంలో పాఠశాలలు తెరిచినా విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదని పాఠశాల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Tags:    

Similar News