ఎంపీ రూ.20 లక్షల ఆర్థికసాయం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగానికి చేయూతగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు రూ.10లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. అంతేకాక తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించేందుకు గాను మరో రూ.10లక్షల సాయం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మన్నే శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేదారినాథ్ ద్వారా రూ.20 లక్షలు ప్రోసిడింగ్‌ను జిల్లా కలెక్టర్‌కు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగానికి చేయూతగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు రూ.10లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. అంతేకాక తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించేందుకు గాను మరో రూ.10లక్షల సాయం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మన్నే శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేదారినాథ్ ద్వారా రూ.20 లక్షలు ప్రోసిడింగ్‌ను జిల్లా కలెక్టర్‌కు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని, అలాగే కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఎంపీ అభినందించారు. జిల్లా కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ.. కరోనాతో పాటు, హరితహారం కార్యక్రమానికి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధుల నుంచి కార్యక్రమానికి రూ.20 లక్షల అందజేయడం అభినందనీయమని అన్నారు.