21 కాదు..100 రోజులు దాటేసింది : శివసేన

ముంబయి : కరోనాను 21 రోజుల్లో కట్టడి చేస్తామని తొలినాళ్లలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శివసేన విమర్శలు గుప్పించింది. ‘మహాభారత సంగ్రామం 18 రోజులు సాగింది. కానీ, కరోనాను 21 రోజుల్లో కట్టడి చేస్తామని ప్రధాని మోడీ విశ్వాసంతో ప్రజలకు హామీనిచ్చార’ ని శివసేన మౌత్‌పీస్‌ ‘సామ్నా’లో ప్రచురించిన ఎడిటోరియల్‌లో గుర్తు చేసింది. అయితే, కరోనాపై పోరు 100 రోజులు దాటిందని, అయినప్పటికీ మహమ్మారి ఇంకా రంకెలు వేస్తూనే ఉన్నదని మోడీపై విమర్శనాస్త్రాలు సందించింది. ఆర్థికంగా […]

Update: 2020-07-07 03:27 GMT

ముంబయి : కరోనాను 21 రోజుల్లో కట్టడి చేస్తామని తొలినాళ్లలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శివసేన విమర్శలు గుప్పించింది. ‘మహాభారత సంగ్రామం 18 రోజులు సాగింది. కానీ, కరోనాను 21 రోజుల్లో కట్టడి చేస్తామని ప్రధాని మోడీ విశ్వాసంతో ప్రజలకు హామీనిచ్చార’ ని శివసేన మౌత్‌పీస్‌ ‘సామ్నా’లో ప్రచురించిన ఎడిటోరియల్‌లో గుర్తు చేసింది. అయితే, కరోనాపై పోరు 100 రోజులు దాటిందని, అయినప్పటికీ మహమ్మారి ఇంకా రంకెలు వేస్తూనే ఉన్నదని మోడీపై విమర్శనాస్త్రాలు సందించింది. ఆర్థికంగా సూపర్ పవర్‌ దేశంగా అవతరించాల్సిన భారత్ రోజుకు సుమారు 25 వేల కరోనా కేసులను నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. కేసుల సంఖ్యలో రష్యాను వెనక్కినెట్టి ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్ ఉందని తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తొలి స్థానానికి చేరినా ఆశ్చర్య పోనక్కర లేదని వివరించింది. కరోనాపై పోరు మహా భారత సంగ్రామం కంటే కఠినమైనదని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు అంటే 2021వరకు ఈ పోరాటం సాగుతుందని శివసేన ఆ ఎడిటోరియల్‌లో అభిప్రాయపడింది. లాక్‌డౌన్ ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి గానీ, లాక్‌డౌన్ డోర్లు తెరిస్తే ప్రమాదం కాచుకు కూర్చున్నదని తెలిపింది.

Tags:    

Similar News