కరోనా చావులును ఎవరు ఆపలేరు: మధ్యప్రదేశ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మరోవైపు ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. టీకాలు వేయించుకోవాలని, మాస్క్ లు ధరించాలని ప్రజలలో అవగాహనా పెంచుతున్నాయి. రాజకీయ నేతలు సైతం కరోనా టీకా వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ తమ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకుంటున్నారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ గడ్డు పరిస్థితిని కామెడీగా తీసుకొంటున్నారు . తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి, బీజేపీ […]

Update: 2021-04-15 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మరోవైపు ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. టీకాలు వేయించుకోవాలని, మాస్క్ లు ధరించాలని ప్రజలలో అవగాహనా పెంచుతున్నాయి. రాజకీయ నేతలు సైతం కరోనా టీకా వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ తమ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకుంటున్నారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ గడ్డు పరిస్థితిని కామెడీగా తీసుకొంటున్నారు . తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌ సింగ్‌ కరోనా మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

మధ్యప్రదేశ్ లో కరోనా మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు కరోనా సూచనలు ఇస్తూనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.’ఈ చావులను ఎవరూ ఆపలేరు., కరోనా నుండి రక్షించుకునేందుకు సహకరించాలంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ప్రతి రోజు చాలా మంది చనిపోతున్నారని అడుగుతున్నారు. వయస్పు పైబడితే చనిపోరా.. ముసలివాళ్ళయ్యాకా ఎలాగూ చనిపోతారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ మంత్రి గారి వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేఫుతున్నాయి. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ప్రజలకు మంచి చెప్పాల్సింది పోయి.. ఇలా మైక్ ఉందికదా అని ఏది పడితే అది మాట్లాడతారా ? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News