క్రీడా, సినీ సెలబ్రెటీలకు మద్రాస్ హైకోర్టు షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ బిజినెస్ జోరుగా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో నేటి యువత వాటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు కోల్పోతున్నారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు ఆ డబ్బులు తీర్చలేక ఆత్మహత్యలు, దొంగతనాలకు సైతం పాల్పడుతున్నారు. అయితే, దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ వ్యాపారాన్ని పెంపొందించేలా పలువురు క్రీడా, సినీ సెలెబ్రిటీలు వాటికి ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన […]

Update: 2020-11-03 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ బిజినెస్ జోరుగా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో నేటి యువత వాటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు కోల్పోతున్నారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు ఆ డబ్బులు తీర్చలేక ఆత్మహత్యలు, దొంగతనాలకు సైతం పాల్పడుతున్నారు. అయితే, దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ వ్యాపారాన్ని పెంపొందించేలా పలువురు క్రీడా, సినీ సెలెబ్రిటీలు వాటికి ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ పై సీరియస్ అయింది. సెలెబ్రిటీలు ఆన్‌లైన్ బెట్టింగ్ వైబ్‌సైట్‌లకు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్న క్రికెటర్లు విరాట్ కోహ్లి, గంగూలీ, సినీతార తమన్నాలపై మద్రాస్ హైకోర్టు అసహనం వ్యక్తం చేయగా.. నటులు ప్రకాష్ రాజ్, రాణా, సుదీప్‌లకు మధురై బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయితే, ఆన్ లెైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును 10 రోజులు సమయం కోరింది. ఇదిలాఉండగా, కోహ్లి మరియు తమన్నా ఎంపీఎల్ (MPL)గేమ్‌కు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తుండగా, గంగూలీ డ్రీమ్‌-11కు ప్రచారకర్తగా ఉన్నారు.

Tags:    

Similar News