ఆ నిర్మాతకు మద్రాసు హైకోర్టు నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: రామనాథపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకూ ఖాతాదారులకు ప్రముఖ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజాకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీ మరియు గ్యాంగ్ ఫైనాన్స్ పేరుతో కోట్లలో చీటింగ్ చేశాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. బాధితులు రామనాథపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ జ్ఞానవేల్ రాజా సినిమాలకు పెద్ద ఎత్తున్న ఫైనాన్స్ చేసినట్టు […]
దిశ, వెబ్ డెస్క్: రామనాథపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకూ ఖాతాదారులకు ప్రముఖ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజాకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీ మరియు గ్యాంగ్ ఫైనాన్స్ పేరుతో కోట్లలో చీటింగ్ చేశాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. బాధితులు రామనాథపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ జ్ఞానవేల్ రాజా సినిమాలకు పెద్ద ఎత్తున్న ఫైనాన్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై జ్ఞాన్ వేల్ రాజాను వివరణ కోరగా, సినిమా లావాదేవీలు తప్ప ఫైనాన్స్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన చెప్పారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు తాను వివరణ చెబుతానని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అందుకు అంగీకరించని హైకోర్టు, ఆగష్టు 7న రామనాథపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.