రజనీకాంత్‌కు హైకోర్టు వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ట్యాక్స్ కట్టకుండా కోర్టులో పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో చేసేదేమి లేక రజనీకాంత్ తరఫు న్యాయవాది కేసును విత్ డ్రా చేసుకునేందుకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. అసలేమైందంటే: కొడంబాక్కమ్‌లో రజనీకాంత్ రాఘవేంద్ర కల్యాణ మండపం నిర్మించారు. అయితే, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మండపం మూసి ఉందని.. ఆదాయం రాలేదని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ విధించిన ట్యాక్స్‌ను కట్టేందుకు నిరాకరించారు. దీనిని సవాల్ […]
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ట్యాక్స్ కట్టకుండా కోర్టులో పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో చేసేదేమి లేక రజనీకాంత్ తరఫు న్యాయవాది కేసును విత్ డ్రా చేసుకునేందుకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
అసలేమైందంటే:
కొడంబాక్కమ్‌లో రజనీకాంత్ రాఘవేంద్ర కల్యాణ మండపం నిర్మించారు. అయితే, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మండపం మూసి ఉందని.. ఆదాయం రాలేదని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ విధించిన ట్యాక్స్‌ను కట్టేందుకు నిరాకరించారు. దీనిని సవాల్ చేస్తూ రజనీకాంత్ మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. కేసును విచారించిన కోర్టు రజనీకాంత్ తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ట్యాక్స్ చెల్లించకపోవడమే కాకుండా.. వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందనిి హెచ్చరికలు చేసింది. దీంతో కేసు వెనక్కి తీసుకుంటామని రజనీకాంత్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.