విశాల్‌పై కేసు.. లైకా ప్రొడక్షన్స్‌కు ఐదు లక్షల జరిమానా..!

దిశ, సినిమా : హీరో విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. నడిగర్ సంఘం, సినిమాలకు సంబంధించిన కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇదే క్రమంలో లైకా ప్రొడక్షన్స్ కాపీ రైట్ ఇష్యూ లేవనెత్తుతూ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు ఎంఎస్ ఆనందన్ ‘చక్ర’ మూవీ తమతోనే చేస్తామని మాట ఇచ్చాడని.. కానీ ఆ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించాడని కేసు పెట్టారు. కాగా దీనిపై విచారించిన […]

Update: 2021-08-18 07:36 GMT

దిశ, సినిమా : హీరో విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. నడిగర్ సంఘం, సినిమాలకు సంబంధించిన కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇదే క్రమంలో లైకా ప్రొడక్షన్స్ కాపీ రైట్ ఇష్యూ లేవనెత్తుతూ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు ఎంఎస్ ఆనందన్ ‘చక్ర’ మూవీ తమతోనే చేస్తామని మాట ఇచ్చాడని.. కానీ ఆ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించాడని కేసు పెట్టారు. కాగా దీనిపై విచారించిన కోర్టు లైకా ప్రొడక్షన్స్‌ను తప్పు పట్టింది. తప్పుడు కేసు పెట్టినందుకు హెచ్చరించిన కోర్టు.. లైకా ప్రొడక్షన్స్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన విశాల్.. న్యాయం తప్పకుండా గెలుస్తుందని, నిజమే విజయం సాధిస్తుందని తెలిపాడు.

Tags:    

Similar News