‘వెడ్డింగ్ సిరీస్‌’లో బ్యూటిఫుల్ మడోనా

దిశ, వెబ్‌డెస్క్: మలయాళి కుట్టి ‘మడోనా సెబాస్టియన్’ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూసిన అభిమానులు అవాక్కయారు. తను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను వరుసగా పోస్ట్ చేయడంతో.. కొంపదీసి మ్యారేజ్ చేసుకుందేమోనని ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్. అంతటితో ఆగకుండా మెసేజ్‌లతో హారెత్తించారు. తన ఇన్ బాక్స్ నిండిపోవడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది మడోనా. తనొక వెడ్డింగ్ సిరీస్ చేయబోతోందని.. అందుకే ఈ ఫొటో షూట్ అని తెలిపింది. ఇదొక అందమైన అనుభవమని.. ఇంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన టీమ్‌కు […]

Update: 2020-11-04 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలయాళి కుట్టి ‘మడోనా సెబాస్టియన్’ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూసిన అభిమానులు అవాక్కయారు. తను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను వరుసగా పోస్ట్ చేయడంతో.. కొంపదీసి మ్యారేజ్ చేసుకుందేమోనని ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్. అంతటితో ఆగకుండా మెసేజ్‌లతో హారెత్తించారు. తన ఇన్ బాక్స్ నిండిపోవడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది మడోనా. తనొక వెడ్డింగ్ సిరీస్ చేయబోతోందని.. అందుకే ఈ ఫొటో షూట్ అని తెలిపింది. ఇదొక అందమైన అనుభవమని.. ఇంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన టీమ్‌కు థాంక్స్ చెప్పింది.

దీంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు ఫొటోల్లో అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రపంచంలోనే అందమైన వధువుగా కనిపిస్తున్నావంటూ పొగిడేశారు. ‘పెళ్లి దుస్తుల్లో ఏంజెల్‌లా కనిపిస్తున్నావ్ మై క్వీన్’ అంటూ లైక్స్ కొట్టేస్తున్నారు ఫ్యాన్స్. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మడోనా.. తెలుగు వెర్షన్‌లోనూ కనిపించింది.

Tags:    

Similar News