హై కోర్టు సంచలన వ్యాఖ్యలు: అమ్మాయిలు సరదా కోసం సెక్స్ చేయడం లేదు..

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి కానీ అమ్మాయిలు, ప్రేమించిన వారితో సరదా కోసం సెక్స్ చేయడం లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారు ప్రేమించినవారిపై నమ్మకం ఉంచి, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామనే నమ్మకంతోనే సెక్స్ కి ఓకే చెప్తున్నారని న్యాయస్థానం తీర్మానించింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక అత్యాచార ఘటన కేసులో  ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది  న్యాయస్థానం. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం ఓ యువతిని, యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని […]

Update: 2021-08-15 03:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి కానీ అమ్మాయిలు, ప్రేమించిన వారితో సరదా కోసం సెక్స్ చేయడం లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారు ప్రేమించినవారిపై నమ్మకం ఉంచి, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామనే నమ్మకంతోనే సెక్స్ కి ఓకే చెప్తున్నారని న్యాయస్థానం తీర్మానించింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక అత్యాచార ఘటన కేసులో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం ఓ యువతిని, యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఆ తరువాత పెళ్లి పేరు చెప్పగానే ప్లేట్ ఫిరాయించడంతో యువతి కోర్టును ఆశ్రయించింది. అయితే యువకుడి తరుపు లాయర్.. యువతి ఇష్టప్రకారమే శృంగారం జరిగిందని, ఆమె మేజర్ కాబట్టి అత్యాచారామనలేమని వాదించారు.

ఇక యువతి తరుపు లాయర్ మాట్లాడుతూ.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండేళ్లుగా భాదితురాలిని అనుభవించాడని, ఆ తరువాత కులాలు వేరని, పెళ్లి జరగడం కుదరదని చెప్పడం అమానుషమని తెలిపారు. ఇక దీంతో ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం.. సంచలన తీర్పు ఇచ్చింది. “ఇండియా సంప్రదాయకమైన దేశమని, అమ్మాయిలు సరదాకు సెక్స్ కి ఒప్పుకోరని, పెళ్లి చేసుకొంటామని నమ్మితేనే అలాంటివాటికి ఓకే చెప్తారని తెలిపింది. యువకుడితో జీవితాన్ని పంచుకునేందుకు బాధితురాలు కట్టుబడి ఉందని, కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆమె ఓ మారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలుసుకున్న కోర్టు యువకుడికి బెయిల్‌ క్యాన్సల్‌ చేస్తూ” తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తోంది.

Tags:    

Similar News