స్కూల్స్ అన్నిటియందు.. ఈ స్కూటర్ స్కూల్ వేరయా!!

దిశ, వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ కరోనా వలన విద్యార్థులు తమ విద్య కు దూరమవుతున్నారు.లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఆన్లైన్ క్లాస్లు కొంతమంది విద్యార్థులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేని గ్రామాల్లోని పిల్లల పరిస్థితి ఏంటి? వారి చదువు ముందుకు ఎలా వెళ్తుంది? ఇక వారు విద్యకు దూరమవ్వాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలు ఒక పక్క విద్యార్థుల తల్లిదండ్రులులోను, వారికి చదువుచెప్పే […]

Update: 2021-03-29 01:24 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ కరోనా వలన విద్యార్థులు తమ విద్య కు దూరమవుతున్నారు.లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఆన్లైన్ క్లాస్లు కొంతమంది విద్యార్థులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేని గ్రామాల్లోని పిల్లల పరిస్థితి ఏంటి? వారి చదువు ముందుకు ఎలా వెళ్తుంది? ఇక వారు విద్యకు దూరమవ్వాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలు ఒక పక్క విద్యార్థుల తల్లిదండ్రులులోను, వారికి చదువుచెప్పే ఉపాధ్యాయులలోను తలెత్తుతున్నాయి. ఇక ఎలాంటి సమస్యకు చెక్ పెట్టాలని క విన్నూత ప్రయోగానికి నాంది పలికాడు భోపాల్ కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీవాత్సవ.

శ్రీ వాత్సవ గతకొన్నేళ్ళుగా భోపాల్ లోని ఒక మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో పాఠశాలకు లాక్ డౌన్ ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆత్మ స్థయిర్యాన్నినింపడానికి ఆయన వాహనాన్నే స్కూల్ గా మార్చేశాడు. స్కూటీ పై ఒక మినీ లైబ్రరీ ని, మరో పక్క బ్లాక్ బోర్డు ను పట్టుకొని విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పాఠాలు చెప్తున్నాడు. అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులను వినడానికి స్మార్ట్ ఫోన్లను, పుస్తకాలూ లేని వారికి పుస్తకాలను అందిస్తున్నాడు.

ఇక్కడ చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. వారి పిల్లలు చదువుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. వారి చదువును మధ్యలో తిప్పకుండా ఉండడానికి తాను ఈ విధమైన బోధన అందిస్తున్నామని శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం ఈ స్కూటర్ స్కూల్ భోపాల్ లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఆదర్శంగా నిలిచింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక ఉపాద్యాయుడు పడే తపనను అందరు మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News