సాయి ధరమ్‌ తేజ్‌ది సెకండ్ హ్యాండ్ బైక్.. మాదాపూర్ డీసీపీ సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు అధికారక ప్రకటన చేశారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ప్రస్తుతం అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని తెలిపారు. […]

Update: 2021-09-11 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు అధికారక ప్రకటన చేశారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ప్రస్తుతం అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని.. బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపుతున్నట్లుగా తెలిపారు. గతంలో కూడా మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌పై రూ.1,135 చలాన్‌ వేశామని.. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ అభిమాని క్లియర్‌ చేశారని చెప్పారు.

ఇక రోడ్డు ప్రమాదం సమయంలో సాయి తేజ్ దాదాపు 72 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం కంటే ముందు దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడుతుపున్నారని.. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని పోలీసులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌ అయి సాయితేజ్ కిందపడ్డాడని.. అతని వద్ద నుంచి టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తమకు లభించలేదని మాదాపూర్ తెలిపారు. తేజ్ దగ్గర లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని మాదాపూర్ డీసీపి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాదం సమయంలో తేజ్ హెల్మెట్‌ ధరించి ఉన్నాడని.. అందుకే ప్రాణాపాయం నుంచి బయటపడినట్లుగా మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఐసీయూలో సాయితేజ్.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ సంచలన ట్వీట్

Tags:    

Similar News