16 ఏళ్ల చిన్నది.. దేశీ పదాలతో సెలబ్రిటీలను సైతం మెస్మరైజ్ చేస్తోంది
దిశ, ఫీచర్: లక్నోకు చెందిన 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ మీథికా ద్వివేది సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. దేశీ పదాలతో కూడిన కామెడీ స్కిట్స్, రీల్స్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది. అలీగంజ్ నివాసియైన ఈ టీనేజర్ ఏడాదిలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ ఏ-లిస్టర్లతో సహా రెండు మిలియన్ ఫాలోవర్లను చేరుకుంది. ట్రైన్డ్ క్లాసికల్ సింగర్, డ్యాన్సర్ అయిన మీథికా.. తన మ్యూజికల్ వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు ‘ది సౌండ్ బ్లేజ్’ పేరుతో ఇన్‌స్టాలో అకౌంట్ ప్రారంభించింది. […]
దిశ, ఫీచర్: లక్నోకు చెందిన 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ మీథికా ద్వివేది సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. దేశీ పదాలతో కూడిన కామెడీ స్కిట్స్, రీల్స్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది. అలీగంజ్ నివాసియైన ఈ టీనేజర్ ఏడాదిలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ ఏ-లిస్టర్లతో సహా రెండు మిలియన్ ఫాలోవర్లను చేరుకుంది. ట్రైన్డ్ క్లాసికల్ సింగర్, డ్యాన్సర్ అయిన మీథికా.. తన మ్యూజికల్ వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు ‘ది సౌండ్ బ్లేజ్’ పేరుతో ఇన్‌స్టాలో అకౌంట్ ప్రారంభించింది. ఆమె తల్లి ఈ పేరును సూచించగా.. ఫస్ట్ ఒక వీడియో సాంగ్ పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత రీల్స్ రూపొందించడంపై దృష్టిపెట్టింది. అవి వీక్షకులకు బాగా నచ్చడంతో ఫేమ్ సంపాదించింది. ఈ వీడియోల షూటింగ్, ఎడిటింగ్ కూడా మీథికానే చేస్తుండగా.. అవన్ని మనుషుల రోజువారీ జీవితానికి సంబంధించినవే కావడం విశేషం.
‘ఆన్‌లైన్ ట్రెండింగ్‌లో ఉన్న అంశాన్నే నా కొత్త వీడియోల కోసం టాపిక్‌గా ఎంచుకుంటాను. కంటెంట్ ప్రత్యేకంగా, కామన్ మ్యాన్‌కు రిలేటివ్‌గా ఉండేలా చూసుకుంటాను. నా ఆన్‌లైన్ పర్సనాలిటీ కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ వీడియోల కోసం ప్రత్యేకంగా యాస లేదా భాషను మార్చను. ఇందుకోసం ఒక్కోసారి రోజులో చాలా గంటలు పని చేయాల్సి ఉన్నా ఇష్టంతోనే చేస్తాను. ఇది నాకు ప్రేరణనిస్తుంది’ అని మీథికా తెలిపింది.
ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న మీథికా.. మీడియా/జర్నలిజంలో కెరీర్ కోసం ప్రయత్నిస్తోంది. చాలా మంది భారతీయ పిల్లలవలె తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం తను చేస్తున్న పనికి కొనసాగింపుగా మీడియాలో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలనుకుంటోంది. ఇక తన వీడియోల పట్ల నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని ఉద్దేశించి.. ‘వారంతా నేను చేస్తున్నది చాలా సులభమని అనుకుంటారు. కానీ ఇలాంటి వీడియోను రూపొందించడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో వచ్చి చూస్తే తెలుస్తుంది’ అంటూ విమర్శకులకు సమాధానమిచ్చింది.