చెత్తతో వంట.. డంప్‌యార్డ్ వద్ద నిరసన

దిశ, వెబ్‌డెస్క్: ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చే గార్బేజ్ వ్యాన్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి వేయాలని మున్సిపాలిటీ వాళ్లు పదే పదే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తడి, పొడి చెత్త కోసం ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలు కూడా ఇచ్చారు. అయినా బాధ్యత మరిచి.. ప్రతి వీధిలో రోడ్డు మీదనే చెత్త పడేస్తూ, దాన్నో డంప్ యార్డ్ చేసేస్తుంటాం. మళ్లీ మనమే ముక్కు మూసుకుంటూ, చెత్త ఎత్తుకెళ్లడం లేదని కంప్లయింట్ […]

Update: 2021-01-02 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చే గార్బేజ్ వ్యాన్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి వేయాలని మున్సిపాలిటీ వాళ్లు పదే పదే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తడి, పొడి చెత్త కోసం ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలు కూడా ఇచ్చారు. అయినా బాధ్యత మరిచి.. ప్రతి వీధిలో రోడ్డు మీదనే చెత్త పడేస్తూ, దాన్నో డంప్ యార్డ్ చేసేస్తుంటాం. మళ్లీ మనమే ముక్కు మూసుకుంటూ, చెత్త ఎత్తుకెళ్లడం లేదని కంప్లయింట్ చేస్తాం. లక్నోలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బాధ్యత లేకుండా రోడ్డు పక్కన చెత్త పడేస్తున్న జనాలకు, ఆ చెత్తను ఎత్తకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపాలిటీ అధికారులకు బుద్ధి చెప్పేందుకు అశుతోష్ సింగ్ అనే వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టగా, మున్సిపల్ అధికారులు దిగి వచ్చి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు.

కాలనీ సమస్యలైనా, ప్రజా సమస్యలైనా.. ఎవరికివారు మాకెందుకులే అనుకుంటే, ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఎవరో ఒకరు ముందుండి పోరాడాల్సిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా మున్సిపాలిటీ సిబ్బంది ఇందిరా నగర్ లొకాలిటీలో చెత్తను క్లీన్ చేయకపోవడంతో, ఎన్నోసార్లు కంప్లయింట్ ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపల్ అథారిటీ స్పందించలేదు. దీంతో స్థానికుడైన అశుతోష్ సింగ్.. రోడ్డు మీదున్న డంప్‌యార్డ్ దగ్గర వంట చేసి వినూత్న నిరసన తెలిపాడు. ఆ చెత్తతోనే మంట వెలిగించి వెజిటేబుల్స్ గ్రిల్ చేయడంతో పాటు టీ, పన్నీర్ సలాడ్‌లు వండిపెడుతూ, మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మున్సిపాలిటీ అధికారులు దిగొచ్చి, సమస్యను సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు చెత్తను శుభ్రం చేసే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించామని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News