కొత్త తూనీగలకు మార్వెల్ హీరోల పేర్లు
మార్వెల్ కామిక్ యూనివర్స్‌లోని సూపర్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవెంజర్స్’ హీరోలంటే చెప్పలేనంత ప్రాణం పెట్టుకుంటారు. నిరంతరం జీవాల మీద పరిశోధన చేసే వారికి కూడా కామిక్స్ అంటే అభిరుచి ఉంటుంది. అందుకే మార్వెల్ కామిక్ యూనివర్స్ హీరోల జ్ఞాపకార్థం ఐదు తూనీగలకు థోర్, డెడ్‌పూల్, లోఖీ, బ్లాక్ విడోతో పాటు మార్వెల్ సృష్టికర్త స్టాన్ లీ పేర్లను పెట్టారు. కొత్తగా గుర్తించిన ప్రతి జీవికి పేరు పెట్టాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే వాటికి గుర్తింపు […]
మార్వెల్ కామిక్ యూనివర్స్‌లోని సూపర్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవెంజర్స్’ హీరోలంటే చెప్పలేనంత ప్రాణం పెట్టుకుంటారు. నిరంతరం జీవాల మీద పరిశోధన చేసే వారికి కూడా కామిక్స్ అంటే అభిరుచి ఉంటుంది. అందుకే మార్వెల్ కామిక్ యూనివర్స్ హీరోల జ్ఞాపకార్థం ఐదు తూనీగలకు థోర్, డెడ్‌పూల్, లోఖీ, బ్లాక్ విడోతో పాటు మార్వెల్ సృష్టికర్త స్టాన్ లీ పేర్లను పెట్టారు. కొత్తగా గుర్తించిన ప్రతి జీవికి పేరు పెట్టాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే వాటికి గుర్తింపు వస్తుందని కామన్‌వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ బ్రయాన్ అంటున్నారు.
ఒక తూనీగకు కళ్లద్దాలు పెట్టినట్టుగా ఉండి అచ్చం స్టాన్ లీ మాదిరిగానే కనిపించడంతో ఆ పేరు పెట్టినట్లు బ్రయాన్ తెలిపారు. అలాగే మరో తూనీగ అచ్చం డెడ్ పూల్ పెట్టుకున్న హెల్మెట్ తలను పోలి ఉందని బ్రయాన్ చెప్పారు. శాస్త్రీయపరంగా వీటన్నింటికీ ‘హ్యుమొరోలెథాలిస్ సెర్జిస్’ అనే పేరు పెట్టారు. అంటే చూడటానికి నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ ఇవి కీటక జాతిలోనే అతి తెలివైన తూనీగలని మరో నిపుణులు యువానితా రోడ్రిగేజ్ తెలిపారు. వీటితో పాటు కనిపెట్టిన స్పైడర్ వాస్ప్ అనే తూనీగ విషంతో అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేయవచ్చునని ఆమె వివరించారు.