Sri Lanka vs India: మరో చెత్త రికార్డు నమోదు చేసిన భారత్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ చెత్త బ్యాటింగ్ చేసింది. ఎంస్ ధోని సారథ్యంలో 2008 ఆస్ట్రేలియా టూర్‌లో 74 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. మరోసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులను చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌తో శ్రీలంక బౌలర్లు చెలరేగిపోయారు. చివరి వరకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ చెత్త బ్యాటింగ్ చేసింది. ఎంస్ ధోని సారథ్యంలో 2008 ఆస్ట్రేలియా టూర్‌లో 74 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. మరోసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులను చేసింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌తో శ్రీలంక బౌలర్లు చెలరేగిపోయారు. చివరి వరకు అదే స్పీడ్‌ను కొనసాగించారు. దీంతో భారత బ్యాట్స్‌మాన్‌లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రుతురాజ్ (14), దేవదత్ (9), సంజూ శాంసన్ (0), నితీష్ రానా (6) పరుగులకే చేతులెత్తేశారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా కోల్పోయిన టీమిండియాకు స్కోర్ చేయడం కష్టతరమైంది. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ (16), కుల్దీప్ యాదవ్(23 నాటౌట్), రాహుల్ చాహర్(5), వరుణ్ చక్రవర్తి(0), చేతన్ సకారియా(5 నాటౌట్) పరుగులు చేయగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. 8 వికెట్ల నష్టానికి భారత్ 81 పరుగులకే పరిమితం అయింది. కాగా, ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంలో ఉన్నాయి. మూడో మ్యాచ్ ఇరు జట్లకు డిసైడర్ గేమ్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో శ్రీలంక జట్టుకు విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.