ప్రేమ తెచ్చిన లొల్లి..
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మాచర్లలో ఓ ప్రేమ వివాదం ఘర్షణకు దారితీసింది. కొంత కాలం నుంచి నక్కా వెంకటరెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ నక్కా వెంకటరెడ్డి యువతిని కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు […]
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మాచర్లలో ఓ ప్రేమ వివాదం ఘర్షణకు దారితీసింది. కొంత కాలం నుంచి నక్కా వెంకటరెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ నక్కా వెంకటరెడ్డి యువతిని కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.