Cute Birds: చక్కని చిలుక తోడుంటే..
దిశ ప్రతినిధి, మెదక్: మనుషుల మధ్యే కాదు.. పక్షుల మధ్యలోనూ ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని ఓ తాటి చెట్టు మధ్యలో ఒక చిలక కోసం మరో చిలక కష్ట పడుతున్న దృశ్యాన్ని ‘దిశ’ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ చిత్రంలో చెట్టు తొర్రలో ఉన్న తోటి చిలుక కోసం ఎక్కడెక్కడో తిరిగి గింజలు తీసుకొచ్చింది మరో చిలక. చెట్టు తొర్రలో ఉన్న చిలుకను బయటకు పిలిచి, ఆప్యాయంగా […]
దిశ ప్రతినిధి, మెదక్: మనుషుల మధ్యే కాదు.. పక్షుల మధ్యలోనూ ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని ఓ తాటి చెట్టు మధ్యలో ఒక చిలక కోసం మరో చిలక కష్ట పడుతున్న దృశ్యాన్ని ‘దిశ’ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ చిత్రంలో చెట్టు తొర్రలో ఉన్న తోటి చిలుక కోసం ఎక్కడెక్కడో తిరిగి గింజలు తీసుకొచ్చింది మరో చిలక. చెట్టు తొర్రలో ఉన్న చిలుకను బయటకు పిలిచి, ఆప్యాయంగా ఆ చిలుకకు తినిపించింది. ఈ చిత్రాన్ని చూసినవారందరూ ఇలాంటి తోడు ఉంటే.. ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నారు.