ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ వన్‌గా ‘బెర్నార్డ్’

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఇప్పటివరకు ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అగ్రస్థానంలోకి చేరుకున్నారు. ఫోర్బ్స్ రియ‌ల్‌-టైమ్ బిలియ‌నీర్స్ తాజా జాబితా ప్రకారం.. ఆర్నార్డ్ సంపద 198.9 బిలియన్‌ డాలర్ల(రూ.14.74 ల‌క్ష‌ల కోట్లు)కు చేరుకోవడంతో మొదటి స్థానానికి చేరుకున్నారు. గురువారం ఒక్కరోజే ఆయన సంపద 0.39 శాతం పెరగడం విశేషం. ఇక, రెండో స్థానానికి వచ్చిన జెఫ్ బెజోస్ సంపద 194.9 బిలియన్ డాలర్లు(రూ.14.44 ల‌క్ష‌ల […]

Update: 2021-08-06 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఇప్పటివరకు ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అగ్రస్థానంలోకి చేరుకున్నారు. ఫోర్బ్స్ రియ‌ల్‌-టైమ్ బిలియ‌నీర్స్ తాజా జాబితా ప్రకారం.. ఆర్నార్డ్ సంపద 198.9 బిలియన్‌ డాలర్ల(రూ.14.74 ల‌క్ష‌ల కోట్లు)కు చేరుకోవడంతో మొదటి స్థానానికి చేరుకున్నారు. గురువారం ఒక్కరోజే ఆయన సంపద 0.39 శాతం పెరగడం విశేషం. ఇక, రెండో స్థానానికి వచ్చిన జెఫ్ బెజోస్ సంపద 194.9 బిలియన్ డాలర్లు(రూ.14.44 ల‌క్ష‌ల కోట్లు)గా ఉంది.

మూడో స్థానంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ 132 బిలియన్ డాలర్ల(రూ.13.74 ల‌క్ష‌ల కోట్లు)ను కలిగి ఉన్నాడు. ఇక, సోషల్ మీడియా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు 130.6 బిలియన్ డాలర్ల(రూ. 9.69 లక్షల కోట్ల)తో నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఏడాదిలో ఆర్నార్డ్‌కు చెందిన లూయిస్ విటన్ కంపెనీ ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సమయంలోనే ఆయన ఎలన్ మస్క్‌ను వెనక్కి నెట్టారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆయన కంపెనీ ఆదాయం 1400 కోట్ల యూరోలుగా నమోదైంది. ఇటీవల పరిణామాలతోనే ఆయన సంపద అనూహ్యంగా పెరిగిందని విశ్లేషకులు తెలిపారు.

Tags:    

Similar News