ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పు ఎవరిదీ?
దిశ, రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయలైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అశ్వారావు పల్లి గ్రామం నుంచి రఘునాథపల్లి గ్రామానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులు. వీరంతా బస్సు వెనుక భాగంలో కూర్చున్నారు. […]
దిశ, రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయలైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అశ్వారావు పల్లి గ్రామం నుంచి రఘునాథపల్లి గ్రామానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులు. వీరంతా బస్సు వెనుక భాగంలో కూర్చున్నారు. బస్సు రఘునాథపల్లి మండల కేంద్రం చేరుకొని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లేందుకు మలుపు తీసుకుంటుంది.
ఈ క్రమంలో హనుమకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును వెనుక భాగంలో ఢీకొట్టింది. అప్పటికే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును వేగంగా యూటర్న్ చేశాడు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మేకలగట్టు గ్రామానికి చెందిన శివసాగర్ అనే విద్యార్థికి తీవ్ర రక్తస్రావం కావడంతో జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు. లారీ డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, యూటర్న్ ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్ అధికారులు దాని సమీపంలో సైన్ బోర్డులను కానీ, స్పీడ్ బ్రేకర్‌లను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.