బస్సు, లారీ ఢీ
దిశ, మహబూబ్ నగర్ లారీ టైరు పగిలి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం ముకర్లబాద్ గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో లారీ డ్రైవర్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు మహబూబ్ నగర్ కు వస్తోంది. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న లారీ టైరు ఒకటి పేలటంతో […]
దిశ, మహబూబ్ నగర్
లారీ టైరు పగిలి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం ముకర్లబాద్ గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో లారీ డ్రైవర్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు మహబూబ్ నగర్ కు వస్తోంది. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న లారీ టైరు ఒకటి పేలటంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ లకు తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ క్యాబిన్ లోఇరుక్కపోయాడు. సుమారు అరగంట సేపు శ్రమించి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు. గాయపడిన ఈ ముగ్గురిని ఆంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా లారీ డ్రైవర్ మార్గమధ్యలో మృతి చెందాడు.
Tags: accident,One’s death, lorry tire puncture, two mens were injured,mahabubnagar