సంక్షోభంలో చిక్కుకున్న తాప్సీ బాయ్‌ఫ్రెండ్?
దిశ, సినిమా: టాలెంటెడ్ తాప్సీ, తాహిర్ రాజ్ భాసిన్.. హీరో హీరోయిన్లుగా నటించిన కామిక్ థ్రిల్లర్ ‘లూప్‌లపేట’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే రివీల్ చేసిన మూవీ యూనిట్.. తాజాగా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. సావి, సత్య లవ్ అండ్ రొమాన్స్, న్యూ ఏజ్ లవ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. మోడ్రన్ స్టోరీగా వస్తున్న సినిమాలో రొమాన్స్, కామెడీ, లవ్ సమపాళ్లలో ఉంటుందని తెలిపారు. సావి తన […]
దిశ, సినిమా: టాలెంటెడ్ తాప్సీ, తాహిర్ రాజ్ భాసిన్.. హీరో హీరోయిన్లుగా నటించిన కామిక్ థ్రిల్లర్ ‘లూప్‌లపేట’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే రివీల్ చేసిన మూవీ యూనిట్.. తాజాగా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. సావి, సత్య లవ్ అండ్ రొమాన్స్, న్యూ ఏజ్ లవ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. మోడ్రన్ స్టోరీగా వస్తున్న సినిమాలో రొమాన్స్, కామెడీ, లవ్ సమపాళ్లలో ఉంటుందని తెలిపారు. సావి తన గురించి తాను తెలుసుకునే క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ సత్య సంక్షోభంలో చిక్కుకుంటాడని, సత్యను క్రైసిస్ నుంచి బయటపడేసేందుకు సావి ఏం చేసింది? న్యూ ఏజ్ లవ్‌లో కామెడీ ఎలా భాగమవుతుంది? అనే విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఆకాశ్ భాటియా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 2021అక్టోబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ‘క్రేజీ సావి, సత్యను మీట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తాప్సీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.
Brace yourself to meet Savi and Satya….. #LooopLapeta in theatres this October 22, 2021. ♾☺️ a comic thriller we rarely get ! @TahirRajBhasin @ellipsisentt @sonypicsfilmsin @vivekkrishnani @tanuj_garg @atulkasbekar @Aayush_BLM#AakashBhatia #LooopLapeta pic.twitter.com/tAgDMyKn6j
— taapsee pannu (@taapsee) March 9, 2021