అత్యంత ఒంటరి ప్రదేశం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: లైట్ హౌస్ కీపర్ జీవితం చాలా ఒంటరితనంతో కూడి ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ప్రదేశంగా గుర్తించిన లైట్ హౌస్‌కి కీపర్‌గా చేయడం సాహసమనే చెప్పాలి. కానీ తప్పదు. ఆ ఒంటరి లైట్ హౌస్ పేరు స్టాన్నర్డ్ రాక్ లైట్ హౌస్. అమెరికాలోని ఈ లైట్ హౌస్ ప్రధాన భూభాగానికి 40 కి.మీ.ల దూరం ఉండటమే కాకుండా అక్కడికి చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సుపీరియర్ సరస్సు ఉత్తర సగభాగంలోని […]
దిశ, వెబ్‌డెస్క్:
లైట్ హౌస్ కీపర్ జీవితం చాలా ఒంటరితనంతో కూడి ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ప్రదేశంగా గుర్తించిన లైట్ హౌస్‌కి కీపర్‌గా చేయడం సాహసమనే చెప్పాలి. కానీ తప్పదు. ఆ ఒంటరి లైట్ హౌస్ పేరు స్టాన్నర్డ్ రాక్ లైట్ హౌస్. అమెరికాలోని ఈ లైట్ హౌస్ ప్రధాన భూభాగానికి 40 కి.మీ.ల దూరం ఉండటమే కాకుండా అక్కడికి చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
సుపీరియర్ సరస్సు ఉత్తర సగభాగంలోని కీవీనా ద్వీపకల్పంలో ఈ లైట్ హౌస్ ఉంది. మనిటో ద్వీపానికి 40 కి.మీ.ల దూరంలో ఇది ఉంది. ఈ లైట్ హౌస్ కట్టిన ఇసుక ప్రాంతాన్ని 1835లో కెప్టెన్ చార్లెస్ సి. స్టాన్నర్డ్ కనిపెట్టారు. అమెరికా మొత్తంలోనే ప్రధాన భూభాగానికి అత్యంత దూరంలో ఉన్న లైట్ హౌస్ ఇది. దీన్ని విమానం, పడవల ద్వారా ప్రయాణించి మాత్రమే సందర్శించగలం. లైట్ హౌస్ లోపలికి వెళ్లడానికి పర్యటకులకు అనుమతి లేదు. కానీ లైట్ హౌస్ దగ్గరి వరకు వెళ్లడానికి మాత్రం అనుమతినిస్తారు.
మొదటిసారిగా ఇక్కడ 1868లో బీకూన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇక్కడ లైట్ హౌస్ కట్టడానికి అనువుగా ఉంటుందా లేదా అని చాలా పరిశోధనలు చేశారు. ఎక్కువగా అలల తాకిడి, ప్రమాదకరమైన పగడపు దిబ్బలు ఇక్కడ ఉండటంతో మొదట చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చివరికి 20 అడుగుల రాయి మీద 1882 నాటికి ఈ లైట్ హౌస్ నిర్మించగలిగారు. 78 అడుగులు ఎత్తు ఉన్న ఈ లైట్ హౌస్‌లో ఏడు అంతస్తులు ఉన్నాయి. కింద కిచెన్ నుంచి మొదలుకుని నిద్రపోయే గదులు, లెన్స్ గదులు, లైబ్రరీ, వాచ్ గదులు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ లైట్ హౌస్ రెండు పనులు చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పగడాల మీది నుంచి వెళ్లే పడవలు, ఓడలకు మార్గదర్శిగా ఉంటోంది. అలాగానే సుపీరియర్ సరస్సు నీటి ఆవిరి వేగాన్ని మానిటర్ చేస్తోంది.