వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రతిప‌క్షనేత చంద్రబాబు ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాల‌ని పంపావంటేనే.. తాడేప‌ల్లి కొంప‌లో ఎంతగా వ‌ణికి చస్తున్నావో అర్థమవుతోందని విమర్శించారు. ఇంత‌కంటే నువ్వు దిగ‌జారవ‌ని అనుకున్న ప్రతీసారీ అధోపాతాళంలోకి దిగ‌జారుతూనే ఉన్నావంటూ మండిపడ్డారు. నీ తాడేప‌ల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత […]

Update: 2021-09-17 10:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రతిప‌క్షనేత చంద్రబాబు ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాల‌ని పంపావంటేనే.. తాడేప‌ల్లి కొంప‌లో ఎంతగా వ‌ణికి చస్తున్నావో అర్థమవుతోందని విమర్శించారు. ఇంత‌కంటే నువ్వు దిగ‌జారవ‌ని అనుకున్న ప్రతీసారీ అధోపాతాళంలోకి దిగ‌జారుతూనే ఉన్నావంటూ మండిపడ్డారు.

నీ తాడేప‌ల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూర‌మో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరమని చెప్పుకొచ్చారు. ఆ వ‌చ్చే రోజు కూడా ఎంతో దూరంలేకుండా నువ్వే తెచ్చుకుంటున్నావు. నీ గాలి హామీలు తేలిపోయాయి. నీ ముద్దులు పిడిగుద్దుల్లా ప‌డుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది అంతా నాట‌కమ‌నీ జ‌నానికి తెలిసిపోయింది. జ‌నం తిర‌గ‌బ‌డే రోజు ద‌గ్గర‌ప‌డింద‌ని, ఉలిక్కిప‌డి ప్రతిప‌క్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంప‌డం ఎందుకు? నువ్వే ఓ సారి వ‌చ్చిపోకూడ‌దు.

మా పెద్దాయ‌న నీలాంటి క్రూర‌, నేర‌స్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాల‌ని నిత్యం త‌పించే క‌ర‌క‌ట్ట ప‌క్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి.. బొత్తిగా నీకు తెలియ‌ని అభివృద్ధి అంటే ఏంటి? కొత్త ప‌రిశ్రమ‌లు ఎలా తీసుకురావాలి? ఉపాధి-ఉద్యోగావ‌కాశాలు ఎలా పెంపొందించాలి? అనే అంశాలు చ‌క్కగా వివ‌రిస్తారు. కాదూ-కూడ‌దు ఇలాగే బ్లేడ్ బ్లాచ్‌ల‌ను వేసుకొచ్చేస్తానంటే, నీ స‌ర‌దాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తామంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

Tags:    

Similar News