రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదే: నారా లోకేశ్

దిశ ఏపీ బ్యూరో: స్కాం చేసినవాళ్లను వదిలేస్తూ, స్కాంను బయటపెట్టిన వాళ్లను జైల్లో వేయడమే రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. 108 అంబులెన్స్‎ల నిర్వహణకు సంబంధించి వందల కోట్ల స్కాం జరిగిందని, ఎంపీ విజయసాయిరెడ్డి తన వియ్యంకుడు, అల్లుడికి దోచిపెడుతున్నారని స్పష్టంగా చెప్పిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 108 అంబులెన్స్‌ల నిర్వహణలో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేకపోతున్న […]

Update: 2020-06-22 08:36 GMT

దిశ ఏపీ బ్యూరో: స్కాం చేసినవాళ్లను వదిలేస్తూ, స్కాంను బయటపెట్టిన వాళ్లను జైల్లో వేయడమే రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. 108 అంబులెన్స్‎ల నిర్వహణకు సంబంధించి వందల కోట్ల స్కాం జరిగిందని, ఎంపీ విజయసాయిరెడ్డి తన వియ్యంకుడు, అల్లుడికి దోచిపెడుతున్నారని స్పష్టంగా చెప్పిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

108 అంబులెన్స్‌ల నిర్వహణలో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేకపోతున్న వైఎస్సార్సీపీ, ఆ స్కాంను కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయాలన్న ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియాల అక్రమాలు బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారని లోకేశ్ విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌ ద్వారా భారీగా మిగిల్చామని బిల్డప్ ఇస్తున్న జగన్ సర్కారు 108 స్కాంపై ఏం సమాధానం చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News