ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తెస్తే ప్రమాదమే : డబ్ల్యూహెచ్‌వో
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా వివిధ దేశాల్లో పాటిస్తున్న లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తేస్తే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, వైరస్ ఉధృతి ఊహించని రీతిలో పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకని దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని, సడలించిన తర్వాత రోజువారీగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మళ్లీ నిషేధాలు విధించాలని సూచించింది. లాక్‌డౌన్ పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరాయని, కరోనా భూతం కాచుకుని ఉన్న సమయంలో ప్రజలు కొత్త జీవన విధానానికి అలవాటుపడాలని […]
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా కారణంగా వివిధ దేశాల్లో పాటిస్తున్న లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తేస్తే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, వైరస్ ఉధృతి ఊహించని రీతిలో పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకని దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని, సడలించిన తర్వాత రోజువారీగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మళ్లీ నిషేధాలు విధించాలని సూచించింది.
లాక్‌డౌన్ పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరాయని, కరోనా భూతం కాచుకుని ఉన్న సమయంలో ప్రజలు కొత్త జీవన విధానానికి అలవాటుపడాలని డబ్ల్యూహెచ్‌వో పశ్చిమ పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ తకేశీ కసాయ్ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. సరైన వ్యాక్సిన్ లేదా ప్రభావంతమైన ట్రీట్‌మెంట్ దొరికే వరకు ఈ జీవనశైలికి అలవాటు పడక తప్పదని ఆయన కోరారు.
Tags: corona, covid, lockdown, gradual, WHO, world health organisation, warning, Takeshi Kasai