రంగారెడ్డిలో లాక్‌డౌన్ పాక్షిక సడలింపు
దిశ, రంగారెడ్డి కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలింపు చేశారు. జిల్లాలో నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు ఇకమీదట ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని కలెక్టర్ పౌసుమీ బసు, ఎస్పీ నారాయణ తెలిపారు. దుకాణం యజమానులు, వారివద్ద పని చేసే వారు సామాజిక దూరం పాటించాలని చెప్పారు. దుకాణాదారులు నిబంధనలు పాటిస్తూ వచ్చే కొనుగోలుదారులను కూడా పాటించేలా చూడాలని కోరారు. […]
దిశ, రంగారెడ్డి
కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలింపు చేశారు. జిల్లాలో నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు ఇకమీదట ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని కలెక్టర్ పౌసుమీ బసు, ఎస్పీ నారాయణ తెలిపారు. దుకాణం యజమానులు, వారివద్ద పని చేసే వారు సామాజిక దూరం పాటించాలని చెప్పారు. దుకాణాదారులు నిబంధనలు పాటిస్తూ వచ్చే కొనుగోలుదారులను కూడా పాటించేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, ఇంట్లోకి వెళ్లే ముందు చేతులను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు.
Tags: Rangareddy, lockdown, collector pausumi basu, relaxation