ఆ అవకాశం ఎక్కువ: మంత్రి సుభాష్ దేశాయ్

ముంబై: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎంతో భేటీ తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్ సుభాష్ దేశాయ్.. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ముంబై సహా పలు మేజర్ నగరాల్లో లాక్‌డౌన్ పొడిగించాలనే భావిస్తున్నట్టు వెల్లడించారు. ముంబయి, థానె, పూణె, మాలేగావ్, ఔరంగాబాద్‌లలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన.. ఈ నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం […]

Update: 2020-05-15 07:59 GMT

ముంబై: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎంతో భేటీ తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్ సుభాష్ దేశాయ్.. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ముంబై సహా పలు మేజర్ నగరాల్లో లాక్‌డౌన్ పొడిగించాలనే భావిస్తున్నట్టు వెల్లడించారు. ముంబయి, థానె, పూణె, మాలేగావ్, ఔరంగాబాద్‌లలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన.. ఈ నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రజల జీవితాలపైనే ఫోకస్ పెట్టిందన్నారు. ఆర్థిక వ్యవస్థనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందే కానీ, ముందు ప్రజల జీవితాలే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ప్రధానమని ఆయన వివరించారు.

Tags:    

Similar News