కోర్టులకు లాక్‌డౌన్ పొడిగించారు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా చాలా వరకు లాక్‌డౌన్ అనివార్యమైంది. ఇటీవల పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించినప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయస్థానాల్లో మాత్రం లాక్‌డౌన్ పొడిగిస్తున్నారు. తాజాగా తెలంగాణలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్ ఆగస్టు 14 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే హౌకోర్టు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని.. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జిల్లా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా చాలా వరకు లాక్‌డౌన్ అనివార్యమైంది. ఇటీవల పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించినప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయస్థానాల్లో మాత్రం లాక్‌డౌన్ పొడిగిస్తున్నారు. తాజాగా తెలంగాణలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్ ఆగస్టు 14 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే హౌకోర్టు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని.. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కూడా పిటిషన్ల దాఖలుకు అనుమతి కల్పించింది.