లాక్‌డౌన్ పొడిగింపు అవకాశాల్లేవు : కిషన్‌రెడ్డి
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు లేవని కేంద్ర ప్రభత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని వచ్చిన వార్తలు నిరాధారమైనవని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా చెప్పారు. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ధ్రువీకరించింది. ప్రధాని మోదీ కూడా ఏప్రిల్ నెలాఖరులో మన్ కీ బాత్ సమయానికి ఆంక్షలు ఉండక పోవచ్చునని శనివారం సూచన ప్రాయంగా చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి […]
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు లేవని కేంద్ర ప్రభత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని వచ్చిన వార్తలు నిరాధారమైనవని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా చెప్పారు. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ధ్రువీకరించింది. ప్రధాని మోదీ కూడా ఏప్రిల్ నెలాఖరులో మన్ కీ బాత్ సమయానికి ఆంక్షలు ఉండక పోవచ్చునని శనివారం సూచన ప్రాయంగా చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా కరోనా లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలు లేవని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఒకట్రెండు రోజుల్లో పరిస్థితి నియంత్రణలోకి
వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన చాలా మందికి 14 రోజుల క్వారంటైన్ పూర్తయిందని, వారందర్నీ త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
Tags : Lockdown, not extension, central minister Kishan Reddy, central govt