జర్మనీలో మళ్లీ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: జర్మనీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న సమయంలో జర్మనీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు సిద్ధమయింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించడానికి చాన్స్‌లర్ యాంజెలా మెర్కెల్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలో కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం […]
దిశ, వెబ్‌డెస్క్: జర్మనీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న సమయంలో జర్మనీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు సిద్ధమయింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించడానికి చాన్స్‌లర్ యాంజెలా మెర్కెల్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలో కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కరోనా విజృంభణ అరికట్టడానికి న్యూ ఇయర్ వేడుకలపై కూడా నిషేధం విధించింది. అయినప్పటికీ అక్కడ రోజు రోజుకీ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.