లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సారి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల శాఖ(ఎంహెచ్‌ఏ) వెల్లడించింది. దీంతో ఈ నెల 4వ తేదీ నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అయితే, పూర్తిస్థాయి లాక్‌డౌన్ కాకుండా.. కరోనా కేసుల ఉద్ధృతి ఆధారంగా హాట్‌స్పాట్‌లు, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా ఏరియాలను విభజించి ఆంక్షలను అమలు చేయనున్నట్టు ఎంహెచ్ఏ పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో పలు కార్యకలాపాలకు […]

Update: 2020-05-01 08:00 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సారి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల శాఖ(ఎంహెచ్‌ఏ) వెల్లడించింది. దీంతో ఈ నెల 4వ తేదీ నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అయితే, పూర్తిస్థాయి లాక్‌డౌన్ కాకుండా.. కరోనా కేసుల ఉద్ధృతి ఆధారంగా హాట్‌స్పాట్‌లు, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా ఏరియాలను విభజించి ఆంక్షలను అమలు చేయనున్నట్టు ఎంహెచ్ఏ పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో పలు కార్యకలాపాలకు మినహాయింపులుంటాయని వివరించింది. అయితే, జోన్‌లకు అతీతంగా కొన్ని కార్యకలాపాలపై నిషేధం ఉండనున్నట్టు తెలిపింది. ఈ రెండు వారాల వ్యవధి కాలంలోనూ విమానం, రైళ్లు, మెట్రో సేవలపై నిషేధాజ్ఞలు ఎప్పట్లాగే అమలు కానున్నాయి. అలాగే, రాష్ట్రాల మధ్య రవాణాపైనా ఆంక్షలు కొనసాగుతాయి. వీటితోపాటు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్య, శిక్షణ సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాల్స్, జిమ్స్, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి అత్యధిక మంది గుమిగూడే ప్రాంతాలపై నిషేధముంటుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సదస్సులపైనా ఆంక్షలు కొనసాగుతాయి. కేంద్ర హోం శాఖ ఇచ్చే అనుమతులకు అనుగుణంగానే విమానయానం, రైళ్లు, రోడ్డు ప్రయాణ అవకాశం ఉంటుంది. మార్చి 25వ తేదీన మొదలైన ఈ లాక్‌డౌన్‌‌ను పొడిగించడం ఇది రెండోసారి.

tags: lockdown, extension, across, country, prohibition, ban, gathering, MHA, home ministry

Tags:    

Similar News