లాక్డౌన్ ఎఫెక్ట్: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ నెల 15న తుది జాబితాను విడుదల చేసి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కానీ రాష్ట్రంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ నెల 15న తుది జాబితాను విడుదల చేసి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కానీ రాష్ట్రంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరో ఏడాది పాటు ఎక్కడా ఎన్నికలు నిర్వహించమంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రాష్ట్రంలో 97 సర్పంచ్లు, 1,083 వార్డు స్థానాలు, రెండు ఎంపీపీలు, ఒక జెడ్పీటీసీ, 24 ఎంపీటీసీ, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాపై షెడ్యూల్జారీ చేసింది. ఇప్పటికే పురపాలిక ఎన్నికలను నిర్వహించిన ఎస్ఈసీ… పంచాయతీ ఎన్నికలను కూడా కంప్లీట్ చేయాలని భావిస్తోంది. కానీ కరోనా ఆంక్షలు ఎన్నికలకు బ్రేక్ వేశాయి.