ఎత్తైన ప్రదేశాల్లో ఉండకండి.. తెలంగాణలోని ఆ మూడు జిల్లాలకు IMD హెచ్చరిక
తెలంగాణలోని మూడు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం(India Meteorological Centre) రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని మూడు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం(India Meteorological Centre) రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. రెండు గంటల పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని సూచనలు చేసింది. అలాగే పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైతులు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.