స్మితా సబర్వాల్ ఇష్యూ పై మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్
స్మితా సబర్వాల్ ( Smita Sabharwal ) ఇష్యూ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) రియాక్ట్ అయ్యా

దిశ, వెబ్ డెస్క్ : స్మితా సబర్వాల్ ( Smita Sabharwal ) ఇష్యూ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) రియాక్ట్ అయ్యారు. స్మితా సబర్వాల్ ఏ ఉద్దేశంతో రీట్వీట్ చేసిందో ఆమెకే తెలియాలని పేర్కొన్నారు. ఆమెది తొందర పాటు తప్ప ఏమీ లేదని తెలిపారు. గతంలో కూడా స్మితా సబర్వాల్ కు యూనివర్సిటీ నుంచి నోటీసులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఆమెనే అడగండి అసలు ఎందుకు రీట్వీట్ చేశారు అని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud).
కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి తెలియక రీ-ట్వీట్ చేసి అది తప్పు అని తెలియగానే సారీ అని తీసేసాడన్నారు. కాగా HCU వివాదంలో X లో పోస్టును రీపోస్ట్ చేసినందుకు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ అయ్యాయి. HCU సంఘటనకు సంబంధించిన AI ఫోటోను రీపోస్ట్ చేసినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలోనే స్మితా సబర్వాల్ ఇష్యూ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. HCUలో జింకలు చనిపోయాయి అనేది అబద్ధం.. అదంతా ఏఐ ఉపయోగించి సృష్టించారన్నారు.