ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సుదీర్ఘ లాక్‌డౌన్ నేపథ్యంలో రెండో లాక్‌డౌన్ సమయంలో పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు చేరుకునేందుకు పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి పాసులిస్తున్నాయి. ఇలా పాసులు తీసుకున్నవారు స్వస్థలాలకు బయల్దేరారు. భారీ సంఖ్యలో రెండు రాష్ట్రాల నుంచి ప్రయాణీకులు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకున్నారు. దీంతో వారిని భద్రతాధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న […]

Update: 2020-05-03 07:57 GMT

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సుదీర్ఘ లాక్‌డౌన్ నేపథ్యంలో రెండో లాక్‌డౌన్ సమయంలో పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు చేరుకునేందుకు పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి పాసులిస్తున్నాయి. ఇలా పాసులు తీసుకున్నవారు స్వస్థలాలకు బయల్దేరారు.

భారీ సంఖ్యలో రెండు రాష్ట్రాల నుంచి ప్రయాణీకులు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకున్నారు. దీంతో వారిని భద్రతాధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న వారిని ఏపీ పోలీసులు అడ్డుకోగా, ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద రాష్ట్రాలు దాటేందుకు పాస్ లు ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా రోడ్లపైనే నిలిపివేశారు. దీంతో రెండు రాష్ట్రాలను కలిపే కర్నూలు, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చేంతవరకు వారిని అలానే ఉంచారు. దీంతో సరిహద్దుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం కలెక్టర్లు స్పందించి, సమస్యను పరిష్కరించడంతో సరైన పాసులు ఉన్నవారిని సరిహద్దులు దాటేందుకు అనుమతించారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేస్తూ, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గరద్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఉందని, వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్ లో పెడుతున్నామని అన్నారు.

వైద్య పరీక్షలు చేసి, వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని, అందువల్ల మిగిలిన వారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని, ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని, ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు.

tags: corona effect, ap, telangana, two state borders, people waiting

Tags:    

Similar News