కొనసాగుతున్న పోలింగ్.. గడువు ముగియగానే గేట్లకు తాళం

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయము నాలుగు గంటలు దాటగానే అధికారులు ఆయా పోలింగ్ స్టేషన్లకు తాళాలు వేశారు. నిర్ణీత గడువులోగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం […]

Update: 2021-03-14 06:40 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయము నాలుగు గంటలు దాటగానే అధికారులు ఆయా పోలింగ్ స్టేషన్లకు తాళాలు వేశారు. నిర్ణీత గడువులోగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. పోలింగ్ ముగియడానికి మరో 2, 3 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

 

Tags:    

Similar News