ఆ రాష్ట్రంలో ప్రతి ఆదివారం లాక్ డౌన్…

దిశ,వెబ్ డెస్క్: దేశంలో కరోనా మరోసారి కోరలు చాచింది. దీంతో కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటీకే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉంది. ఈ కఠిన చర్యల్లో భాగంగానే ప్రతి ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ఛింద్వాడా, రత్లామ్, ఖర్గోనా, భైతూల్, […]

Update: 2021-03-25 03:58 GMT

దిశ,వెబ్ డెస్క్: దేశంలో కరోనా మరోసారి కోరలు చాచింది. దీంతో కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటీకే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉంది. ఈ కఠిన చర్యల్లో భాగంగానే ప్రతి ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలోని ఛింద్వాడా, రత్లామ్, ఖర్గోనా, భైతూల్, జబల్‌పూర్, ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో ఆదివారం పూర్తీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ లాక్‌డౌన్ అమలుకానుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

Tags:    

Similar News