ఇండ్లు పంపిణీ చేసి వెళ్లిన కేటీఆర్.. 10 నిమిషాలకే పెద్ద ఆందోళన

దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట సీసీ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. సీసీ నగర్ లో రూ. 20. 46 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 ఇండ్లను కేటీఆర్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్ల కేటాయింపులో పైరవీలకు తావివ్వలేదని, ఎవరి జోక్యం […]

Update: 2021-12-17 02:52 GMT

దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట సీసీ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. సీసీ నగర్ లో రూ. 20. 46 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 ఇండ్లను కేటీఆర్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్ల కేటాయింపులో పైరవీలకు తావివ్వలేదని, ఎవరి జోక్యం ఉండదని, ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా లబ్ధిదారులతో రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం కేసీఆర్ గుర్తించి అన్ని సౌకర్యాలతో సొంత ఇంటిలో పేద ప్రజలు సంతోషంగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే సదుద్దేశంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ శర్మ, స్థానిక కార్పొరేటర్లు కురుమ హేమలత, మహేశ్వరి శ్రీహరి ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల కేటాయింపులో అవకతవకలు..?

ఇండ్ల పంపిణీ అనంతరం మంత్రి వెళ్లిపోయిన తర్వాత ఆర్డీవో, ఎమ్మార్వో సమక్షంలో లాటరీ పద్ధతిలో మొదటి అంతస్తు, రెండవ అంతస్తు ఇలా లబ్ధిదారులకు కేటాయింపు జరిగింది. కానీ కొందరికి కావాలని మొదటి అంతస్తులో ఇచ్చారని లబ్ధిదారులు ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు స్పందిస్తూ వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవ్వడం జరుగుతుందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతోపాటు గతంలో తమకు పట్టాలు, సర్టిఫికెట్స్ ఉన్నప్పటికీ నూతనంగా నిర్మించిన ఇండ్లల్లో కేటాయించలేదని కొంతమంది స్థానికులు అధికారుల ముందు మొరపెట్టుకున్నారు.

Tags:    

Similar News