రుణమాఫీ విధివిధానాలు ఖరారు

దిశ, న్యూస్ బ్యూరో: రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 2018 డిసెంబర్ 11 వరకు లక్ష రూపాయల లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయనున్నారు. మొదటి విడత కింద రూ.25వేల లోపు రుణాలు ఒకే వాయిదాలో మాఫీ చేయనున్నారు. అనంతరం […]

Update: 2020-03-17 07:13 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 2018 డిసెంబర్ 11 వరకు లక్ష రూపాయల లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయనున్నారు. మొదటి విడత కింద రూ.25వేల లోపు రుణాలు ఒకే వాయిదాలో మాఫీ చేయనున్నారు. అనంతరం లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను 4 విడతలలో మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ పథకం వర్తించదని తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్సెల్బీసీ) రుణమాఫీకి అర్హత ఉన్న రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు.

tags : crop loan waiver, guidelines, kcr, telangana

Tags:    

Similar News