బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ వాంగ్మూలం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. లక్నోలోని ఈ కోర్టుకు వీడియో లింక్ సహాయంతో సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద వాంగ్మూలాన్ని అందించారు. ఈ సెక్షన్ కింద వాంగ్మూలమిచ్చి తమ అమాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని కోర్టు కల్పిస్తున్నది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోని 32 మంది వాంగ్మూలాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సేకరిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు […]
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. లక్నోలోని ఈ కోర్టుకు వీడియో లింక్ సహాయంతో సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద వాంగ్మూలాన్ని అందించారు. ఈ సెక్షన్ కింద వాంగ్మూలమిచ్చి తమ అమాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని కోర్టు కల్పిస్తున్నది.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోని 32 మంది వాంగ్మూలాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సేకరిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31లోపు తీర్పు వెలువరించడానికి విచారణను ఈ కోర్టు త్వరితగతిన చేపడుతున్నది. ఎల్‌కె అడ్వాణీకి ముందు బీజేపీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, రామచంద్ర కటారియా, శివసేన ఎంపీ సతీష్ ప్రధాన్, మరో నిందితుడు సుధీర్ కక్కాడ్‌ల స్టేట్‌మెంట్‌లను ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కె యాదవ్ రికార్డ్ చేశారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను రాజకీయకక్షతో ఈ కేసులో ఇరికించిందని, తాను అమాయకుడినని కక్కాడ్ ఇతర నిందితుల్లాగే తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. రామ మందిరం ఆ మసీదు కిందే ఉన్నదని ‘కర సేవకులు’ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో అడ్వానీ, జోషీలు రామాలయ నిర్మాణం మూవ్‌మెంట్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే.