షాపుల మూత.. క‘రెంటు’ కష్టాలు!
దిశ, ఖమ్మం: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిరు వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు 35 రోజులుగా షాపులు మూతపడటంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. రెంటు గానీ, కరెంటు బిల్లలుగానీ చెల్లించే పరిస్థితిలేదని అంటున్నారు. తోపుడుబండ్లు, పూలు, చెప్పులు, కంగన్‌హాల్స్, ఫొటోస్టూడియోలు, హోటళ్లు, కాఫీ కేఫ్‌లు, టీ స్టాళ్లు, సెలూన్లు, సోడా వ్యాపారులు, బుక్‌స్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు ఇలా ప్రజల అవసరాలను […]
దిశ, ఖమ్మం: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిరు వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు 35 రోజులుగా షాపులు మూతపడటంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. రెంటు గానీ, కరెంటు బిల్లలుగానీ చెల్లించే పరిస్థితిలేదని అంటున్నారు. తోపుడుబండ్లు, పూలు, చెప్పులు, కంగన్‌హాల్స్, ఫొటోస్టూడియోలు, హోటళ్లు, కాఫీ కేఫ్‌లు, టీ స్టాళ్లు, సెలూన్లు, సోడా వ్యాపారులు, బుక్‌స్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు ఇలా ప్రజల అవసరాలను తీర్చే ప్రతి వ్యాపారం మూతపడింది. వస్తువులు కొనేవారు లేక వ్యాపారులు విలవిలలాడుతున్నారు.
చిరువ్యాపారుల వద్ద సిబ్బంది భవిత?
ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లోనే దాదాపు 45 వేల మందికి పైగా చిరు వ్యాపారులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వీరి సంఖ్యలో లక్షల్లో ఉంటుంది. రోడ్లపై వ్యాపారం చేసుకునే కుటుంబాలు లాక్‌డౌన్ కారణంగా పస్తులుంటున్నాయి. చిరు వ్యాపారాల షాపుల్లో సిబ్బంది భవితవ్యం గందరగోళంగా మారింది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వీరిని వెంటనే పనిలోకి తీసుకుంటారన్న నమ్మకం లేదు. లాక్‌డౌన్ నష్టాలను భర్తీ చేసుకునేందుకు సిబ్బందిని తీసేసే ఆలోచనతో ఉండటం గమనార్హం. ఖమ్మం పట్టణానికి చెందిన సెల్ షాపు వ్యాపారి రమేష్ మాట్లాడుతూ నెలరోజులుగా షాపు మూసి ఉండటంతో ఇప్పుడు కనీసం దాని రెంటు కట్టడం, కరెంటు బిల్లలు చెల్లించడం కూడా కష్టమైంది. షాపులో పనిచేస్తున్న ముగ్గురికి జీతాలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ఆన్‌లైన్ విక్రయాలు మొదలైన నాటి నుంచి షాపు నిర్వహణ అంతంతమాత్రంగా ఉండగా ఇప్పుడు మాపైనా లాక్‌డౌన్ పిడుగు పడిందని విచారం వ్యక్తం చేశారు. ఇక రెండు, మూడు నెలలపాటు ఈ ప్రభావం కొనసాగే పరిస్థితి ఉంది. జనాలు షాపులకు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని భయాందోళన వ్యక్తం చేశారు.
Tags: lockdown , covid 19, coronavirus, little merchants, people, market