నాయినా..!

Poem

Update: 2024-09-29 18:45 GMT

నాయినా జీవితాన్ని

అక్షరాల్లో చెప్పాలంటే

పదాల అల్లికకే సరిపోదని చెప్పగలను

నాయినా కష్టాన్ని

ఒకవేళ తూకమేసి చెప్పాలంటే

అది భూమి బరువు అంత

అని చెప్పగలను..!

నాయినా దుఃఖం

ఎంతా అని ఎవరన్నా అడిగితే

అది సంద్రం అని చెప్పగలను

నాయినా ప్రేమ

ఎంత అని ఎవరన్నా అడిగితే

అది అనంతం అని చెప్పగలను

నాయినా మీకేం ఇచ్చాడని

ఎవరన్నా అడిగితే

ఆకాశం ఎత్తు ఎదగమని

తన అస్తిత్వాన్ని ఇచ్చాడని చెప్పగలను..!

నాన్న అమ్మలు మా కోసం ఎన్నో త్యాగం చేసి

తన దారిలో ఎన్నో అవమానాలు,నిందలు మోసి

హద్దులు లేని ప్రపంచాన్ని చూడమని

సుద్దులు చెప్పి స్వేచ్ఛను పంచారు…!

(నాన్న సెప్టెంబర్ 30,2024. పదవి విరమణ సందర్భంగా రాసినది..)

వంగల సంతోష్

95737 86539

Tags:    

Similar News

స్మృతి..!